IntrovertSoul™
IntrovertSoul™

@JSPSoul007

38 Tweets 29 reads Jan 13, 2023
Personal Thoughts After Hearing @PawanKalyan Sppech at #YuvaShakti
1. ఎందుకు తనని తాను తక్కువ అంచనా వేసుకుంటున్నాడు ? 2019 కి 2024 పరిస్థితులు వేరు కదా..!
2. అన్ని కమిటీలు వేసుకొని,బలమైన నాయకులను పార్టీలో చేర్చుకొని వారాహి యాత్ర చేస్తూ ప్రజల్లో తిరిగితే కదా తెలిసేది మన బలం..?
3. 2019 లో Vaccum లేదు అలాంటి సమయంలో 7% వచ్చింది...ఇప్పుడు కనీసం ~15% వరకు ఉంటుంది...కమిటీలు, చేరికలు పూర్తి చేసుకొని ప్రజల్లోకి వెళితే ఇంకా పెరుగుతుంది
4. ఇప్పుడు చాలా Vaccum ఉంది ఎంత బలంగా నిలబడి ,ప్రజల్లో తిరిగి పోరాడితే అంత బలం పెరుగుతుంది కనీసం ~25 % కి అస్సలు తగ్గదు
5. టీడీపీతో పొత్తు పెట్టేసుకుంటే సీఎం సీటు మనకు ఇచ్చేస్తారు అని ఊహల్లో కొందరు ఉన్నారు అది వాళ్ళ రాజకీయ అమాయకత్వం.
6.సీఎం సీటు కాదు కదా షేరింగ్ కి కూడా చంద్రబాబు లాంటి వ్యక్తి అస్సలు ఒప్పుకోడు, ఆయన గురించి ,ఆయన రాజకీయాల గురించి తెలిసినవాళ్లకి ఇది బోధపడుతుంది.
7. బాబు లాంటి జిత్తులమారి నక్క సొంత కొడుకు కు సీఎం సీటు వదిలిపెట్టదానికి కూడా లక్ష సార్లు ఆలోచిస్తాడు అలాంటిది అసలు తన డిక్షనరీ లో లేని త్యాగం ఎలా చేస్తాడు అనుకుంటున్నారు.
8.ఇకపోతే "కొన్ని సీట్లు" ఇది అంతకంటే క్లిష్టమైన అంశం...అస్సలు తెగే అంశం కాదు.
9. ఎందుకంటే జనసేన బలంగా ఉన్న స్థానాలే దాదాపు అవి టీడీపీ బలమైన స్థానాలు..కావున ఈ అంశం తేగాలి అంటే ఎదో ఒక పార్టీ COMPROMISE అవ్వాలి...
10.ఇక్కడ టీడీపీ compromise avuthundhi అనుకోవటం మన ఎర్రి తనం...ఇక జనసేన "రాష్త్రం, ప్రజల కోసం " Compromise అవుతుందా అనే భయం ఉంది.
11. కళ్యాణ్ గారికి రాజకీయాల కంటే "రాష్ట్ర ప్రయోజనాలు" ముఖ్యం...కానీ " తగ్గను" అని కళ్యాణ్ గారు చెప్పిన ఆయన అతి మంచితనం, ప్రజల మీద ప్రేమ తగ్గేలా చేస్తుందేమో అని భయం.
12. నిన్న స్పీచ్ లో బాబు తో భేటీ గురించి మాటల్లో చెపుతూ " సీట్ల గురించి మాట్లాడలేదు, మాట్లాడను కూడా" అన్నారు .
13. అది విన్న తరువాత మాట్లాడే పరిస్థితి , సమయం అది కాకపోయినా , భవిష్యత్తులో ఆ సమయం వచ్చినప్పుడు రాజకీయం, సీట్లు కంటే ప్రజా ప్రయోజనాలకే ఎక్కవా ప్రాధాన్యం ఇచ్చే మనసత్వం ఆయనది అని అర్థమవుతుంది
14. ఇంతకీ మనది రాజకీయ పార్టీ ఆ...లేక ప్రజా ప్రయోజనాల సేవ సంస్థ నా..?
15. వైసీపీ నిరంకుశ పాలన & ప్రజా ప్రయోజనాలు ఈ రెండు అంశాలను బూచిగా
చూపి ఆయన్ని తగ్గేలా ప్రేరేపిస్తారు అనే భయం ఉంది.
16. వైసీపీ,టీడీపీ దొందూ దొందే...కావున టీడీపీతో వెళ్ళటం అనేది నిప్పులో దూకడం కాదు కానీ దాని మీద పెనం పెట్టి కూర్చోవటం అవుతుంది అది మెల్లి మెల్లిగా దహించి వేస్తుంది.
17. ఇక ఒంటరి ప్రయాణం చేస్తే 2024 లో సీట్ల పరంగా కళ్యాణ్ గారు చెప్పినట్లు "వీరమరణం" పొందిన, ఓట్ల శాతం పరంగా "సంజీవని" లభిస్తుంది అనేది నా అభిప్రాయం
18. మరి మళ్ళీ వైసీపీ వస్తుంది కదా మరి ప్రజల పరిస్తితి ఏంటి అంటే అది " ప్రజల తప్పు " అవుతుంది.
19. మనం "ఒంటరి" ప్రయత్నం చేసి మార్పు కోరిన అధి పుర్తి స్థాయిలో ప్రజలు ఆశించనప్పుడు దాని పర్యవసానాలు వాళ్ళే ఎదుర్కోవాలి కదా...
20. రాజకీయంగా కొత్తగా జనసేనకు పోయేది ఏమి లేదు బొక్క టిడిపి కే, పెద్ద బొక్క ప్రజలకే...
కాబట్టి బాల్ వాళ్ళ కోర్టు లోనే ఉంచేద్ధం...
21. ప్రజలకు మంచి పరిపాలన అందించటానికి వేరే పార్టీలతో కలవటం తప్పేమీ కాదు...కానీ వైసీపీ నీ బూచిగ చూపించి టీడీపీతో కలవటం కరెక్టేనా..?
22. పాతికేళ్ల ప్రయాణం అన్నారు కదా వైసీపీ నిరంకుశ పాలనను ఇంకో 5 ఎండ్లు ఎదుర్కోలేరా అంటే రాజకీయంగా ఎదుర్కొటాం మరి ప్రజలు సంగతి ఏంటి అని ఆలోచిస్తున్నారా
23. ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదా, నమ్మకం కల్పించట్లేదా సరే కానీ మిమ్మల్ని మీరు ఎందుకు నిందించు కుంటున్నారు..మీ ప్రయత్నం మీరు చేయండి నమ్మకపోతే అధి వాళ్ళ కర్మ
24.మీరు ప్రజల్లోకి రండి,తిరగండి,పోరాడండి, అడగండి సాధ్యమైనంతవరకు చేయండి అంతిమంగా ప్రజా తీర్పు ఏ కదా ఎవరి కర్మకి వారే బాధ్యులు
25. ఇక గౌరవం అది టీడీపీ/బాబు నుండి... అది ఎలా అంటే సెప్టిక్ టాంక్ లో ముత్యం వెతుక్కోవడం లాంటిది...ప్రజల కోసం కొంచెం తగ్గిన టీడీపీ doesn't DESERVE it.
26. ఏ ఊరు పేరు లేని పార్టీలతో పొత్తు పెట్టుకున్న, ఎవరిని పార్టీలోకి తీసుకున్న పర్లేదు కనీసం దాని వల్ల కొంత కొత్త నీరు వస్తుంది
27. టీడీపీతో కలగకపోతే మళ్ళీ వైసీపీ వస్తుంది అని మాట్లాడుతున్నారు... అరే బాబు పోరాడితే పోయేది ఏమి లేదు భానిస సంకెళ్లు తప్ప, సంకెళ్లు తెంచుతున్న ఆలాగే బానిసలాగే వుంటాం అని ప్రజలు నిర్ణయించుకుంటే ఆ ప్రజల కర్మ ...
28. పోరాడుదాం , నిలదీద్ధం, గట్టిగా నిలబడుధం నిర్ణయం ప్రజలకు వదిలేద్దాం
29. ప్రజల కోసం , రాష్ట్రం కోసం నువ్ కొంచెం కూడా తగ్గకు, సర్డుకపోకు They Don't DESERVE it, అది కూడా టీడీపీ లాంటి విష వృక్షంతో...@PawanKalyan
30. నా దృష్టిలో వైసీపీ టీడీపీ రెండు ఒకటే ఒకడు ముందు నుండి పొడిస్తే మరొకడు వెనుకనుండి పొడస్తాడు.
31. ఒంటరిగా పోటీ చేయటం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి తెలుసు...దెబ్బలు తింటాం, రక్తాలు కారుతాయి,మాటలు పడుతం, ఎన్నో ఎదుర్కొంటం అవన్నీ ఎదుర్కొనే సత్తా నీకు ఉంది.ఇవన్నీ నువ్వు అసలు ఆత్ కేర్ కూడా చేయవ్ కానీ ప్రజలు/రాష్ట్రమని జాలి చుపించకు...
32. Do your work & disappear ఇక్కడ పనికి రాదు
33. హనుమంతుడిల మీ బలం మీకు తెలియట్లేదు, అలా అని మీకు పూర్తి బలం ఉంది అనట్లేదు కానీ మీరు అనుకునే అంత తక్కువ అయితే లేదు.
34. వారాహి తో రండి, ప్రజల్లో తిరగండి, క్షేత్ర స్థాయిలో బలం పెంచుకొని/తెలుసుకొని ముందుకు సాగుదాం
35. రాజకీయ చదరంగంలో ఉన్నాం...ఒక్క సైనికులతోనే అడుతా అంటే కుదరదు, మద గజాలు, గెలుపు గుర్రాలు, మంత్ర తంత్రాలు కావాలి.
36. గిరి గీసుకుని, కంపౌండ్ ల మధ్య ఉండకు..OUT OF THE BOX వచ్చి రాజకీయం చేద్దాం, కొత్తగా మనకు పోయేది పోయేది ఉడేది ఏమి లేదు
37.ప్రజలను సొంత కుటుంబం అనుకునే వ్యక్తివి నువ్వు...గొప్ప గొప్ప యుద్ధాలు అన్ని నా అనుకునే వాళ్ళతోనే ఉంటాయి కావున GRANTED గా ఉండకు
38. నువ్వు అన్నట్టు గానే ఎలక్షన్ రాగానే, నా కులం, నా గోత్రం, అంటూ పది పరకకు అమ్ముడుపోతారు
39. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారినే ఓడించిన ప్రజలు, మిమ్మలని గెలిపిస్తరని నమ్మకం కలిగిస్తారు అని ఎలా అనుకుంటున్నారు,ఎవడి నమ్మకం మీదో మనం రాజకీయాలు చేయొద్దు మనల్ని మనం గట్టిగా నమ్ముకుందాం
40. క్షణానికి మారిపోయే అవకాశం ఉన్న రాజకీయ వ్యవస్థలో ఉన్నాం..బల బలాలు ఇప్పుడే నిర్ణయించుకోకు
41. ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నావ్, ఎన్నో చూసావు, ఎన్నో మాటలు పడ్డావు, నిలబడ్డావు, ఎంతో చేశావ్...మావొడు ఓడిపోయిన నిలబడ్డాడు రా అనిపించుకున్నవ్
42. ఎన్ని అవమానాలు, ఓటములు , మాటలు రుచి చూసిన మా అందరికీ వ్యక్తిగతంగా BLOODY SATISFACTION ఇచ్చావ్
43. ఒకడేమో ప్యాకేజీ ఇచ్చారు అని నింద వేస్తే వాడేమో ఖండిచకుండ మావొడే అంటూ మాట్లాడుతూ 60:40 రాజకీయాలు చేస్తారు, వాళ్ళు వాళ్ళు బానే వుంటారు మధ్యలోకి ఎవడైనా వస్తే అడ్డు తొలగించాలనో చూస్తారు.
44. ఇవన్నీ ప్రజలకు తెలుసు అయిన వాళ్ళనే నమ్ముతారు, కానీ మనం వాళ్ళ కోసం త్యాగం చేయాలా
45. సినిమాల్లో రోజుకు కోటి సంపాదించే స్థానంలో ఉన్నావ్ అయిన ఎవడో ల*కొడుకు నీకు ప్యాకేజీ ఇచ్చారు అని చెప్తే నిజమే నేమో అనే నమ్మే ప్రజలు ఈ సమాజంలో కోకొల్లలు..
46. నీ స్వప్రయోజనాల కోసం తగ్గిన ఒకింత నేను సంతోషిస్తా కానీ ఎవరి కోసమో తగ్గితే సహించటం నా వల్ల కాదు
47. అధికారం ఇస్తే సేవ చేస్తా, లేదా ఊడిగం చేస్తా అన్నావు...నీకు అధికారం ఇచ్చిన ఇవ్వకపోయినా సేవ చేస్తావు అది నీ ఇష్టం కానీ నువ్వు ఎవడికి , ఏ పార్టీకి, ప్రజలకు ఊడిగం చేయాల్సిన అవసరం లేదు.
48. నువ్వు ఊడిగం చేయాల్సిన అంతా CHARACTER ఉన్న మనుషులు ఎవడు లేడు ఇక్కడ...
49.వారాహి తో రా...ప్రజాక్షేత్రంలో బలంగా నిలబడి వాళ్ళను, వీళ్ళను చూసారు మాకు " ఒక అవకాశం " ఇవ్వమని అడుగు...బలంగా ప్రయత్నం చెయ్
50. Do Your Work 100%...let them Decide...నమ్మకపోతే వాళ్ళ కర్మ అనుభవిస్తారు అప్పుడు కూడా వాళ్ళ తో నిలబడు ఎదో ఒకరోజు సచ్చినట్టు మూసుకొని నమ్ముతారు
51. ఇప్పుడు టీడీపీతో కలిస్తే అధికారం పదవులు వస్తాయి అంటున్నారు మరి 2014 లో అధికారం/పదవులు ఎందుకు తీసుకోలేదు.. స్వాశక్తి తో సాధించుకుందాం అనే కదా ఆరోజు వద్దు అనింది మరి ఇప్పుడు ఎవడితోనో కలిసి అధికారం ఆశించటం ఎందుకు
52. మార్పు అంటూ వచ్చి మళ్ళీ అదే రొచ్చులో కలిసిపోతే ఎలా
53. పొత్తు లేకపోతే టీడీపీ బతకదు, కానీ టీడీపీ/బాబు పొత్తుల గురించి బహిరంగంగా మాట్లాడటం చూసారా, మళ్లీ మేమే, అంత మేమే అనే తీరులో వాళ్ళ వ్యవహారం నడుస్తుంది.
54.సరే మనం రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకుంటే మరి వాళ్ళు రాష్ట్రం కోసమే మనతో కలుస్తున్నారు అని GARANTEE ఇవ్వగలరా
55. అసలు ముందు మన పార్టీని బలిష్టం చేసుకోకుండా ఈ పొత్తు ముచ్చట్లు ఏంటి..? ఎందుకు పదే పదె పొత్తు పొత్తు అని మాట్లాడుతున్నారు.
56. పార్టీ ఎన్ని కార్యక్రమాలు మంచి పనులు చేసిన ఈ పొత్తు మాటల వల్ల కేవలం ఈ పొత్తు అంశాలే HIGHLIGHT అవుతుంది
57. ముందు పార్టీ నిర్మాణం పూర్తి చేసి, నాయకులను ఆహ్వానించి, లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుని, పార్టీలో అన్ని వ్యవస్థలను కట్టుదిట్టం చేసి, ఆర్థిక వనరులను కూడగట్టి ప్రజల్లోకి రావాలి
58. వారాహి యాత్ర మొదలు పెట్టీ ప్రజల్లో తిరుగుతూ మన బల బలాలను అంచనా వేసుకుంటూ ముందుకు సాగాలి
59. వైసీపీ ను ఎదుర్కొనే ధైర్యం టీడీపీ/బాబు కంటే పవన్ కళ్యాణ్ కే ఎక్కువ ఉంది,అసలు వాళ్ళకి భయపడి ఇంట్లో కూర్చున్న టీడీపీ నీ 2021 ఇప్పటంలో జరిగిన ఆవిర్భావ సభలో మీరు ఇచ్చిన "ప్రతిపక్ష ఓటు చిలనివ్వను" అనే మాటే కదా...
60. మునిగిపోతున్న టీడీపీని లేపి మళ్ళి మీరే అందులో ఎక్కుతాను అంటే ఎలా
61.ఆ మాటతో ఊపిరి పోసుకున్న టీడీపీ మళ్ళీ డ్రామాలు స్టార్ట్ చేసి మహానాడు బలుపుని వాపు అనుకొని మీనవేశాలు వేసి మళ్ళీ ఎదో తేడా కొడుతుంది అని"వన్ సైడ్ లవ్" అని చిల్లును పుడ్చుకునే ప్రయత్నం చేసింది
62.ఇప్పటికీ కూడా కళ్యాణ్ గారిని తగ్గిస్తూ పది పాతిక సీట్లు అని పచ్చ కథనాలు రాయిస్తున్నారు
63. ఇక 2014 లో ఏమి ఆశించకుండా సపోర్ట్ చేస్తే గెలిచిన తరువాత వాళ్లు మాట్లాడిన మాటలు, అల్లిన కథలు, చేసిన పనులు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
64. 2014లో ప్రజల కోసం నిస్వార్థ మైన సపోర్ట్ ఇస్తే దాని వల్ల వచ్చిన " నిందను" ఇప్పటికీ మొస్తున్నం,
65.నిన్న సభలో "మీకు కోపం రావాలి, తెగించి పోరాడాలి" అన్నావ్ కానీ మాకు కోపం రావట్లేదు అని ఇక రాదు అనుకొని వదిలేసి టీడీపీతో వెళ్తవా, వాళ్ళు కాకపోతే వీళ్ళు అని అదే మూస ధోరణి లో ఉంచి చావలేని వాళ్ళలా బతికేయండి అని అంటావా
66. Let's Fight for a CHANGE అని చెప్పి మళ్ళీ అందులోనే కలిపెస్తవ
67.అయిన తప్పు అంతా మాదెలే, నువు వచ్చినప్పుడే కనిపించే నాయకులు, రూపాయి బయటికి తీయని లీడర్లు, ఎవరైనా వేస్తే మా స్థానం తగ్గిపోతుంది అనుకునే కంపౌండ్ గాళ్లు, మేమేం తక్కువ అని ఇగో చూపించే పెద్ద మనుషులు, నికే సలహాలు ఇచ్చే నాలాంటి అభిమానులు పెట్టుకొని ఇంత కాలం నడిపించటామే గ్రేట్..🙏
68. ప్రతి పార్టీ అధినేత ఒంటరిగా పోరాడి సాధించాలి అనే అనుకుంటారు. కళ్యాణ్ గారు కూడా ఆ ఉద్దేశం తోనే పార్టీ పెట్టారు,14లో నిస్వార్థంగా పక్కకు తప్పుకున్నాడు, 19లో క్లిష్టమైన పరిస్థితిలో నిలబడ్డాడు .
69. ఇప్పుడు పొత్తు ద్వారా వెళ్తాం అంటున్న , ఈ నిర్ణయం సాదాసీదాగా తీసుకొని వుండడు
70. వైసీపీ నిరంకుశ పాలన, వోట్ ట్రెండ్, ఆర్థిక బలం, పోల్ మనేజిమెంట్ లాంటి వ్యవస్థలు పార్టీలో లేకపోవటం, పుర్తి స్థాయిలో ప్రజలు మార్పు వైపు నిలబడుతారా, నన్ను నమ్ముకొని ఉన్న నాయకుల రాజకీయ భవిష్యత్తు etc లాంటి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఒంటరిగా వెళ్తే వోట్ చిలి మళ్ళీ ప్రజలకి ఇబ్బంది అని
71. పోనీ పొత్తు పెట్టుకొని పోతే ఓ పాతిక సీట్లు o నాలుగు మంత్రి పదవులు వస్తాయి కదా అంటున్నారు నిజమే కానీ I didn't Feel it's RIGHT
72. మనం వచ్చింది కేవలం కొన్ని సీట్లు,పదవుల కోసం కాదు కదా , అలా అయితే 14లోనే తీసుకునే వాళ్ళం కదా...
73. పాతికేళ్ల ప్రయాణం కోసం కదా వచ్చింది. తాత్కాలిక ప్రయోజనాలు చూసుకుంటే LONG RUN లో దీర్ఘకాలిక సమస్యలు వెంటాడుతాయి, ఆ "నింద" జీవితాంతం మోయాల్సి వస్తుంది దాన్ని నమ్మే వారు పెరుగుతారు
74. పార్టీని భవిష్యత్తులో ఒక ALTERNATIVE గా ప్రజలు చూడటం మానేస్తారు

Loading suggestions...