మునుపు మంత్రి పదవులైనా, ముఖ్యమంత్రి పదవైనా అధికార దర్పాన్ని ప్రదర్శించటానికి, ఆయా పార్టీలలో తన ప్రాముఖ్యతను చాటుకోటానికి మాత్రమే ఉపయోగపడేవి. ఆయా పదవులకి కావల్సిన అర్హత ఉన్నదా లేదా అనేదానికన్నా, అధిష్టానం అడుగులకు మడుగులొత్తుతున్నాడా లేదా అనేదే అర్హతకు ప్రమాణంగా ఉండేది.1/8
రకరకాల సమీకరణాల మధ్య ఎవరు మంత్రి ఔతారో, ముఖ్యమంత్రి ఔతారో తెలిసేది కాదు. ఆనక, ఆ పదవి నిలుపుకోటానికి నానా గడ్డి కరవాల్సి వచ్చేది. నిత్య అసమ్మతివాదులని బుజ్జగించుకోటంలోనే సమయమంతా గడిచిపోయేది. పాలన మీద ధ్యాస, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే సమయం ఉండేది కాదు.2/8
అప్పటిరోజుల్లో దేశంలో ఉన్న ముఖ్యమంత్రులెవరో గమనించండి. దేవెగౌడ, జెహెచ్ పటేల్, ములాయం, మాయావతి, దిగ్విజయ్ సింగ్, జయలలిత, కరుణానిధి, షెకావత్... వ్యక్తిగత వైషమ్యాలతో, స్వార్ధపూరిర రాజకీయాలతో ప్రజలను మభ్యపెడుతూ పరిపాలన చేసిన ముఖ్యమంత్రులే దాదాపు అందరూ.3/8
మిగతా ముఖ్యమంత్రులు వారి మంత్రులకు దిశానిర్దేశమే చేయలేకపోతున్న రోజుల్లో, తన మంత్రులకే కాదు, ఎమ్మెల్యేలకు, అధికారులకి చివరికి తనకు కూడా లక్ష్య నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కేవలం నిర్దేశించి వదిలేయటం కాదు, వాటి ఆధారంగా పనితీరును సమీక్షించటం మొదలేసింది చంద్రబాబే.4/8
సంక్షేమం అంటే ఉచితంగా పంచే తాయిలం కాదని, ఆయా పథకాల ముఖ్యోద్దేశ్యం ప్రజలకు స్వావలంబన కల్పించటమే అని భావించినవాడు బాబు. ఈ ఆలోచన పార్టీకి రాజకీయంగా కీడు కలిగించేదైనా, నమ్మిన ఆశయాన్ని సాధించటానికి ఏనాడు వెనుకడుగు వేయలేదు.5/8
జన్మభూమి, రైతుబజారు లాంటి పథకాలు ఒక ఎత్తైతే, హైటెక్‌సిటీ, జినోమ్‌వ్యాలీ మరో ఎత్తు. నదుల అనుసంధానం, ఆర్టీజీఎస్ ఒక ఎత్తైతే, స్వీయ ఆర్ధిక స్వావలంబనతో అమరావతి నిర్మాణం మరో అద్భుతమైన ఆలోచన. అందుకే ఆయన్ని విజనరీ అనేది.6/8
ఏదేమైనా, ఒక రాజ్యాంగబద్ధమైన పదవికి బాధ్యత నేర్పినవాడు చంద్రబాబు. రాజకీయాల్లో ప్రొఫెషనలిజం తెచ్చినవాడు చంద్రబాబు. ముఖ్యమంత్రి పదవికి సొబగులద్దినవాడు చంద్రబాబు. ఇది ఆషామాషీగా ముఖస్తుతి కోసం చేసే వ్యాఖ్యలు కావు.7/8
ప్రస్తుతం దేశంలో పెద్ద పిశాచాలు, రాష్ట్రంలో పిల్ల పిశాచాలు రాజ్యం ఏలుతున్నాయి. ప్రజల రక్తాన్ని పీల్చి పారేస్తున్న ఈ పిశాచాల నుండి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడే శక్తియుక్తులు మరిన్ని చంద్రబాబుకు దేవుడు కల్పించాలని, ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ...
Loading suggestions...